Home  »  TV News  »  Podharillu : మహా కోసం స్కూటీ కొన్న చక్రి.. భర్తగా గుర్తింపు దక్కేనా?

Updated : Jun 19, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -139 లో......మహాకి సర్ ప్రైజ్ అని చక్రి స్కూటీ తీసుకుంటాడు. మొత్తం డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని ఓనర్ తో చక్రి అంటాడు. ఆ తర్వాత చక్రి స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్తాడు. నన్ను ఇంత ప్రొద్దున హడావిడిగా తీసుకొని వెళ్ళింది ఇందుకే అని మాధవ వాళ్ళతో కేశవ అంటాడు. మీరు అందరూ ఇక్కడే ఉండండి మహాని తీసుకొని వస్తానని చక్రి లోపలికి వెళ్తాడు. మీకొక సర్ ప్రైజ్ కళ్ళు మూసుకొని రండీ అని చక్రి అనగానే మహా అలాగే వస్తుంది. ఆ తర్వాత స్కూటీకి మాధవ, కన్నా, చక్రి, కేశవ నలుగురు అడ్డుగా ఉంటారు. వాళ్ళు పక్కకి తప్పుకుంటారు. ఇక వాళ్ళ వెనకాల ఉన్న స్కూటీని‌ మహా చూసి ఎవరికి కన్నాకా అని అనగానే కాదు మీకే అని చక్రి చెప్తాడు. దాంతో మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత కానీ నాకు స్కూటీ రాదని మహా చెప్తుంది. సైకిల్ వచ్చినా చాలని చక్రి అనగానే సైకిల్ కూడా రాదని మహా అంటుంది. సరే నేను నేర్పిస్తాను అని చక్రి అంటాడు. వద్దని మహా అంటుంది. కన్నా నేర్పిస్తాడని కన్నాని మహా తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏంట్రా ఆ అమ్మాయి అసలు నిన్ను భర్తగా ఫీల్ అవ్వడం లేదు.. నీకు దమ్ముంటే వెళ్లి నేర్పించమని చక్రిని నారాయణ రెచ్చగొడతాడు. ఆ తర్వాత కేశవ షాప్ దగ్గరికి శైలు వస్తుంది. సారీ మొన్న నిన్ను అలా కొట్టి ఉండకూడదని కేశవ చెప్పగానే శైలు షాక్ అవుతుంది. ఏంటి అన్నా పాము, ముంగీస ఎప్పుడు అయిన కలుస్తాయా అని కేశవ అసిస్టెంట్ బంటీ అంటుంటే అదేం లేదురా అని కేశవ అంటాడు. మరొకవైపు మహాకి కన్నా స్కూటీ నేర్పిస్తాడు. నేను నేర్పిస్తానని చక్రి అంటాడు. నువ్వు ఇంకా హేళన చేసినట్లు మాట్లాడతావు.. వద్దని మహా అంటుంది అలా ఏం అనను అని చక్రి అనగానే దానికీ మహా సరే అంటుంది. మహా వెనకాల కూర్చొని తనని పట్టుకొని ఇప్పుడు మరింత దగ్గర అవొచ్చని చక్రి అనుకుంటాడు. మహా నడుపుతూ స్కూటీ పడేస్తుంది. ఇద్దరు పడిపోతారు అన్నయ్య పడకుండా ఆపొచ్చు కదా అని కన్నా అంటాడు. అందరు ఇంటికి వెళ్తారు వదినకి దెబ్బ తగిలిందని కన్నా చెప్తాడు. నేర్చుకునేటప్పుడు పడడం సహజం అని నారాయణ అంటాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర మహా ఒక్కతే డ్రైవ్ చేస్తుంది. తన చుట్టూ అందరు ఉంటారు. మహా ఎక్కడ పడిపోతుందోనని భయపడతారు. తరువాయి భాగంలో నన్ను అసలు భర్తగా చూడడం లేదని ఓం కరేశ్వర్ తో చక్రి డ్రింక్ చేస్తూ చెప్తాడు. అబ్బాయివి నువ్వే ఒక అడుగు ముందు వెయ్యాలని అతను సలహా ఇవ్వడంతో చక్రి డ్రింక్ చేసి మహా గదిలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.